అమ్మ ఏడ్చింది
నేను ఈ ప్రపంచాన్ని చూడకముందే,
నాన్న ఆనందంలో నన్ను చూసుకుని అమ్మ ఏడ్చింది.
నేను తలకిందులై జన్మించే ఆ క్షణాలలో
నా క్షేమం కోరుకుంటూ, తను బాధ పడుతూ అమ్మ ఏడ్చింది.
పెరుగుతున్న నన్ను, తన కలలని,
కంటిపాపలా కాపాడుతూ, ఆ కంటికే తెలీయకుండ అమ్మ ఏడ్చింది.
అల్లరి చిల్లరిగా ఆటలాడుతూ దెబ్బతగిలించుకున్న
నేను ఏడ్వటం చూడలేక అమ్మ ఏడ్చింది.
తప్పు ద్రోవలో వెళ్ళానని తెలిసి
ఆవేశంగా నన్ను కొట్టినా, అమ్మా ఏడ్చింది.
చదువులకీ, ఉద్యోగాలకీ నేను దూరాలు వస్తే
తను తినే ప్రతీసారీ నా ఆకలి గురించి ఆలోచిస్తూ అమ్మ ఏడ్చింది.
నేను పెళ్లి చేసుకుంటే తనకు దూరం అవుతానని తెలిసినా
నా జీవతం, సంతోషం కోసం అర్ధం చేసుకుని అమ్మ ఏడ్చింది.
నా పుట్టుక ముందునుండి, ఒకవేళ, మరణం తర్వాత కూడా ఏడ్చే ఆ పిచ్చి అమ్మ
నేను ఈ పది వాక్యాలు ఎంత ముద్దుగా వ్రాసానని మురిసిపోతూ ఏడ్చింది. ఏడుస్తుంది.
Leave a Reply