వెన్నెలా.. వెన్నెలా.. మెల్లగా రావే…
కిందనున్న రైలుకన్నా పరుగులో..
బుర్రనిండ నిండివున్న ఆలోచనలకు తోడై.. మెల్లగా రావే…
గుర్తుకొచ్చే సిరివెన్నెల పాటవై.. ఎగిరొచ్చే రెక్కల పల్లకిపై..
ఆగని సమయమై, సాగిన పయనమై.. మెల్లగా రావే…
చల్లని గాలికి అమ్మ లాలిలా.. దరి చేరుతున్న నిద్దురని..
కన్నులే మరిచేలా.. మెల్లగా రావే. వచ్చి ఉండిపోవే..
వెన్నెలా.. ఓ వెన్నెలా.. మెల్లగా రావే !
Leave a Reply